NLG: జీపీ ఎన్నికల ప్రచార హడావుడి నిన్న సాయంత్రంతో ముగియడంతో అదే రాత్రి ఆ తర్వాతి వ్యూహంపై అభ్యర్థులు అనుచరులతో సమాలోచనలు చేసినట్లు సమాచారం. బుధవారం రాత్రి ఓటర్లను ఎలా ప్రసన్నం చేసుకోవాలనే విషయంలో అభ్యర్థుల్లో టెన్షన్ పెరిగింది. రేపు ఉదయం పోలింగ్ ప్రారంభం కానుండగా ఈరోజు రాత్రి, రేపు తెల్లవారుజాము వరకు మద్యం, డబ్బులు ఓటర్లకు చేర్చేలా ప్లాన్ చేశారు.