వరంగల్ జిల్లా వర్ధన్నపేట, పర్వతగిరి, రాయపర్తి మండలాల్లో తొలి విడత పంచాయతీ ఎన్నికల ప్రచారం మంగళవారం ముగిసింది. 91గ్రామాల్లో 800 వార్డులకు జరుగు ఎన్నికల్లో 11 సర్పంచ్లు, 215వార్డులు ఏకగ్రీవం కాగా, మిగతా స్థానాలకు 299 సర్పంచ్,1318 వార్డు మెంబర్లు బరిలో ఉన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నాగరాజు, యశస్విని రెడ్డి, బీఆర్ఎస్ నేత ఎర్రబెల్లి, బీజేపీ నేతలు ప్రచారం చేశారు.