ప్రకాశం: కంభం మండలంలోని దర్గా గ్రామంలో ఎస్సై నరసింహ రావు ఆధ్వర్యంలో పల్లెనిద్ర కార్యక్రమాన్ని మంగళవారం రాత్రి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన గ్రామస్తులకు సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాలు మరియు ఇటీవల కాలంలో ఎక్కువగా జరుగుతున్న దొంగతనాలపై అవగాహన కల్పించారు. ప్రజలు సైబర్ మోసాల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని ఎస్ఐ నరసింహారావు అన్నారు.