VSP: జీవీఎంసీలో అవినీతిని ఉపేక్షించేది లేదని కమిషనర్ కేతన్ గార్గ్ స్పష్టం చేశారు. అవినీతి ఆరోపణలపై ఇప్పటికే ఒక డీఈఈ (DEE), టీపీవో (TPO)ను సరెండర్ చేశామని, ఏఈ (AE)పై విచారణకు ఆదేశించామని తెలిపారు. అవినీతికి పాల్పడే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఉద్యోగులంతా పారదర్శకంగా పనిచేసి నగర అభివృద్ధికి సహకరించాలని ఆదేశించారు.