సత్యసాయి: రాష్ట్ర ఫుడ్ కమీషన్ మెంబర్ గంజమల దేవిని ధర్మవరం మండల రేషన్ డీలర్లు కలిశారు. క్వింటాకు ఇస్తున్న కమిషన్ను రూ.100 నుంచి రూ. 200లకు పెంచాలని విజ్ఞప్తి చేశారు. ఇంటి వద్దే రేషన్ పంపిణీ చేస్తున్న డీలర్లకు గౌరవ వేతనం కింద రూ. 5,000 ఇవ్వాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. వారి సమస్యలను పై అధికారులకు తెలియజేస్తానని గంజమల దేవి హామీ ఇచ్చారు.