AP: ‘సాక్షి’ ప్రసారాల నిలిపివేతపై విచారణను TDSAT ట్రిబ్యునల్ వచ్చే మార్చికి వాయిదా వేయడాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టింది. ప్రభుత్వం రాష్ట్రంలో తమ ప్రసారాలను నిలిపివేసిందన్న సాక్షి పిటిషన్పై విచారణ సందర్భంగా.. TDSAT తక్షణమే విచారణ జరిపి పరిష్కరించాలని ఆదేశించింది. ఎవరూ నిజాలు చెప్పట్లేదని, న్యూస్ పేపర్ దృక్పథాన్ని బట్టి విషయం మారుతోందని ఈ సందర్భంగా న్యాయస్థానం పేర్కొంది.