నారాయణపేట పట్టణంలోని గోదాములో ఉన్న ఈవీఎంలను మంగళవారం దత్త బృందావన్ బీఈడీ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్‌కు తరలించినట్లు కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నాయకుల సమక్షంలో ఈవీఎంలు, వీవీప్యాట్లను తరలించినట్లు చెప్పారు.