VZM: కలిసి పనిచేద్దాం, ప్రజలకు మెరుగైన సేవలు అందిద్దాం అనే దానిపై జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ దామోదర్ మంగళవారం ఇష్టాగోష్టి నిర్వహించారు. ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ.. మహిళల భద్రత, రహదారి భద్రత,సైబర్ భద్రతను జిల్లా ప్రజలకు కల్పించడంతోపాటు, గంజాయి నియంత్రణకు కళ్లెం వేయడానికి అధిక ప్రాధాన్యం కల్పిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. సమావేశంలో ఎస్.బి.సీఐలు ఉన్నారు.