ఉక్రెయిన్లో ఎన్నికలు నిర్వహించకపోవడాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇటీవల తప్పుపట్టారు. ఎన్నికలు ఆపేందుకు యుద్ధాన్ని సాకుగా వాడుకొంటున్నారని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఈ అంశంపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్స్కీ స్పందించారు. మిత్ర దేశాలు తమ భద్రతకు హామీ ఇస్తే.. రానున్న రెండు, మూడు నెలల్లోనే ఉక్రెయిన్లో ఎన్నికలు నిర్వహిస్తామని వెల్లడించారు.