VZM: ఈనెల 13న,జరగబోయే జాతీయ లోక్ అదాలత్‌కు సంబంధించి జిల్లా పోలీసు అధికారులతో కోర్టు సమావేశం మందిరంలో జిల్లా న్యాయవాది ఎం. బబిత ఆధ్వర్యంలో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా న్యాయవాది మాట్లాడుతూ.. రాజీకి సంబంధించి అన్ని క్రిమినల్ కేసులను, చెక్ బౌన్స్ కేసులు గుర్తించి జాతీయ లోక్ అదాలత్ పరిష్కారం అయ్యే మార్గం చూడాలని సూచించారు.