NTPT: మండలంలోని అమ్మిరెడ్డిపల్లికి ఐదు రోజులుగా బస్సు రాకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై ఎస్ఎఫ్ఎ ఆధ్వర్యంలో విద్యార్థులు మంగళవారం నారాయణపేట డిపో ఎదుట ధర్నా నిర్వహించారు. ఎస్ఎఫ్ఎ రాష్ట్ర నాయకులు నరహరి భాను ప్రసాద్ సమస్యను డిపో అధికారుల దృష్టికి తీసుకెళ్లగా, బుధవారం నుంచి బోయిలపల్లికి బస్సు నడుపుతామని హామీ ఇచ్చారు.