NZB: ఆర్మూర్, ఆలూరు మండలాల్లో మూడో దశలో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. మంగళవారంతో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. దీంతో అధికారులు ఏకగ్రీవం అయిన అభ్యర్థుల వివరాలు వెల్లడించారు. ఆలూర్ మండలం మిర్దాపల్లి గ్రామంలో సర్పంచ్ పదవికి ఎటువంటి ప్రత్యర్థులు లేకపోవడంతో యల్లా సాయిరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.