అమెరికాలో జనవరి నుంచి 85,000 వీసాలు రద్దు చేయనున్నట్లు ఆ దేశ విదేశాంగశాఖ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ‘మేక్ అమెరికా సేఫ్ ఎగైన్’ అని అందులో పేర్కొంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, విదేశాంగశాఖ మంత్రి మార్కో రుబియో దీనికి కట్టుబడి ఉన్నారని తెలిపింది. ట్రంప్ హయాంలోని అక్కడి ప్రభుత్వం వలసలు, సరిహద్దు భద్రతపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా కఠిన చర్యలు చేపడుతోంది.