NGKL: జిల్లాలోని రౌడీషీటర్ల కార్యకలాపాలపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని ఎస్పీ సంగ్రామ్ పాటిల్ ఆదేశించారు. వంగూర్, వెల్దండ, కల్వకుర్తి, ఉర్కొండ పోలీస్ స్టేషన్లను ఆయన సందర్శించారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై, ఎన్నికల బందోబస్తు ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు. కొట్ర ఎక్స్ రోడ్డు వద్ద చెక్ పోస్ట్‌ను తనిఖీ చేసి, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు.