AKP: విద్యార్థులు చదువుతోపాటు క్రీడల పట్ల ఆసక్తి చూపించాలని ఎన్టీపీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సమీర్ శర్మ సూచించారు. పరవాడ మండలం లంకెలపాలెం జడ్పీ హైస్కూల్ ప్రాంగణంలో మంగళవారం జరిగిన రూరల్ స్పోర్ట్స్ మీట్ కార్యక్రమాన్ని ప్రారంభించారు.హెచ్ఎం రౌతు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీల్లో మండలానికి చెందిన 14 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు.