AKP: బాల్య వివాహాల వల్ల ఎన్నో అనర్ధాలు జరుగుతాయని ఐసీడీఎస్ సీడీపీఓ లలిత కుమారి అన్నారు. సబ్బవరం మండలం రావాలమ్మపాలెం జడ్పీ హైస్కూల్లో కిషోర్ బాలికలకు బాల్యవివాహాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. బాలికలు ఉన్నత విద్యావంతులు కావాలన్నారు. బాల్య వివాహ ముక్త్ భారత్ కార్యక్రమంలో భాగంగా బాల్య వివాహాల నిర్మూలనకు 100 రోజుల కార్యక్రమం అమలు చేస్తున్నామన్నారు.