BHPL: పంచాయతీ ఎన్నికల సందర్భంగా గ్రామాల్లో మద్యం పర్వం జోరందుకుంది. కుల, యువజన సంఘాల మద్దతు కోసం అభ్యర్థులు బ్రాండెడ్ మద్యంతో పాటు నాన్వెజ్ భోజనాలతో దావత్లు ఇస్తున్నారు. చిన్న గ్రామాల్లో రూ.లక్ష, పెద్ద గ్రామాల్లో రూ.5 లక్షల వరకు మద్యం ఖర్చు చేస్తున్నారని చెబుతున్నారు. పోటీ ఎక్కువైతే ఈ వ్యయం రూ.20 లక్షలకు చేరుతోంది.