ప్రకాశం జిల్లాలో స్క్రబ్ టైఫస్ జ్వరం గురించి ప్రజలు ఆందోళన చెందకుండా వైద్యాధికారులు అవగాహన కల్పించాలని కలెక్టర్ రాజాబాబు అన్నారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయం నుంచి మంగళవారం సాయంత్రం మండల స్థాయి అధికారులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో అన్ని మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో స్క్రబ్ టైఫస్‌కు సంబంధించి మందులన్నీ అందుబాటులో ఉన్నాయన్నాని తెలిపారు.