KMM: గ్రామ పంచాయతీ ఎన్నికల తొలిదశ పోలింగ్ ఏడు మండలాల్లో గురువారం నిర్వహించనున్నారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒకటి వరకు పోలింగ్ నిర్వహించి మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్లు లెక్కించి ఫలితాలు వెల్లడిస్తారు. ఆ వెంటనే ఉప సర్పంచిని ఎన్నుకుంటారు. కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, అదనపు కలెక్టర్ శ్రీజ.. పలు మండల కేంద్రాలకు వెళ్లి ఏర్పాట్లను పరిశీలించారు.