కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈనెల 15 నుంచి 20 వరకూ జర్మనీలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ఆయన ప్రవాస భారతీయులతో భేటీ కానున్నారు. పలువురు జర్మనీ మంత్రులను కలవనున్నారు. రాహుల్ వెంట ఓవర్సీస్ కాంగ్రెస్ ఛైర్పర్సన్ శాం పిట్రోడా జర్మనీ పర్యటనకు వెళ్లనున్నారు.