WGL: ఈ నెల 11, 14, 17 తేదీల్లో జరగనున్న GP ఎన్నికల విధుల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వినియోగించుకోవచ్చని ఎన్నికల అధికారులు తెలిపారు. తమ ఓటు హక్కు ఉన్న మండలంలోని MPDO కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ సెంటర్లో డ్యూటీ ఆర్డర్ కాపీ, ఉద్యోగ ఐడీ, ఓటరు కార్డుతో ఫారం-14, 15 పూర్తి చేసి ఓటేయవచ్చు అని అధికారులు పేర్కొన్నారు.