ATP: రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టిస్తున్న స్క్రబ్ టైఫస్ వ్యాధి అనంతపురం జిల్లాకు పాకింది. ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో ఇద్దరు బాలికలకు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం వీరి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు డాక్టర్లు స్పష్టం చేశారు. అయితే, కేసుల సంఖ్య అధికమవుతున్నందున స్క్రబ్ టైఫస్ లక్షణాలున్న వారికి అధికార యంత్రాంగం వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.