NZB: నిజామాబాద్ జిల్లాలోనీ వేల్పూర్ మండలంలో మంగళవారం సాయంత్రం నామినేషన్ల ఉపసంహరణ అనంతరం ఎన్నికల పోటీ చిత్రం స్పష్టమైంది. మండలంలో మొత్తం 14 గ్రామాల్లో 46 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. అలాగే 180 వార్డుల్లో 67 ఏకగ్రీవం కాగా 113 వార్డులకు 271 మంది పోటీదారులు బరిలో నిలిచారు.