AP: ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఈ రోజు మంత్రులు, కార్యదర్శుల సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ) వృద్ధి రేటు పెంచేందుకు వచ్చే 4 నెలల్లో చేపట్టాల్సిన ప్రణాళికపై చర్చించనున్నారు. అలాగే 2025-26 ఆర్థిక సంవత్సరం మొదటి రెండు త్రైమాసికాల్లో సాధించిన ఆర్థిక ఫలితాలపైనా సమీక్షిస్తారు. ఉ.10:30 నుంచి మ.1:45 వరకూ ఈ సమావేశం జరుగుతుందని సమాచారం.