సూడాన్‌లో రెండు దశాబ్దాల క్రితం దారుణాలకు పాల్పడిన అలీ మహమ్మద్ రహమాన్‌కు అంతర్జాతీయ నేర న్యాయస్థానం (ICC) 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. సూడాన్‌లో జంజావీద్ దళ నాయకుల్లో ఒకడైన రహమాన్ అత్యంత క్రూరంగా హత్యలు, అత్యాచారాలకు పాల్పడ్డాడని, సుమారు 213 మంది మరణానికి కారకుడయ్యాడని ప్రాసిక్యూషన్ ఆరోపించింది. 16 మంది మహిళలు, బాలికలపై అత్యాచారాలకూ బాధ్యుడని తెలిపింది.