KNR: ఇల్లందకుంట మండలంలో భోగంపాడు సర్పంచ్‌గా ఏలేటి నిర్మల ఏకగ్రీవం అయినట్లు ఎంపీడీఓ రాజేశ్వరరావు తెలిపారు. గ్రామంలో జనరల్ మహిళా రిజర్వేషన్ ఉండగా సర్పంచ్ బరిలో ముగ్గురు నామినేషన్ వేయగా నిర్మలను ఏకగ్రీవం చేశారు. అయితే గ్రామ అభివృద్ధి విషయంలో రూ. 21 లక్షలకు ఏకగ్రీవం అయినట్లు స్థానికంగా చర్చ నడుస్తుంది. సర్పంచ్ పాటు 7 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి.