కృష్ణా జిల్లా SP వి. విద్యా సాగర్ నాయుడు ఆదేశాల మేరకు కంకిపాడు SI తాతాచార్యులు NH -65 దావలూరు టోల్ గేట్ వద్ద ప్రత్యేక హెల్మెట్ డ్రైవ్ మంగళవారం నిర్వహించారు. హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేసే వారిని ఆపి, ISI సర్టిఫైడ్ హెల్మెట్ వినియోగం, ట్రాఫిక్ నియమాలు, వేగ నియంత్రణ, మొబైల్ వాడకాలు, రిఫ్లెక్టివ్ జాకెట్లు, వాహన పత్రాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు.