ADB: ఉమ్మడి జిల్లాలో చలి తీవ్రత గణనీయంగా పెరగడంతో ప్రజలు గజగజా వణికిపోతున్నారు. కెరమెరి, లింగాపూర్, జైనూర్, వాంకిడి మండలాల్లో పగటి పూట కూడా ఉష్ణోగ్రతలు తగ్గిపోతున్నాయి. చలి నుంచి ఉపశమనం పొందేందుకు జనం చలి మంటలు కాచుకుంటున్నారు. మరికొందరు స్వెటర్లు, ఇయర్ మఫ్స్ వంటి వెచ్చని దుస్తులు ధరించి ఒంటిని కప్పుకుంటున్నారు.