ADB: మావల హరితవనం ముందున్న జాతీయ రహదారిపై మంగళవారం సాయంత్రం ఆర్టీసీ బస్సును లారీ ఢీకొంది. ముందు వెళ్తున్న ఆదిలాబాద్ డిపోకు చెందిన బస్సును వెనుక వస్తున్న లారీ ఢీకొనటంతో బస్సు వెనుక ఉన్న అద్దాలు పగిలిపోయి వెనుకభాగం ధ్వంసం అయింది. బస్సులోని ప్రయాణిస్తున్న నలుగురు ప్రయాణికులు స్వల్పంగా గాయపడినట్లు స్థానికులు తెలిపారు.