HYD: KPHB పోలీస్ స్టేషన్ పరిధిలోని బాలాజీ హాస్టల్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలో రూ.16 వేల విలువైన 1.63 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. రూమ్ నంబర్ 306లో ఉంటున్న మహమ్మద్ ఆరిఫ్ (20)ను అరెస్టు చేశారు. నిందితుడు మహారాష్ట్ర నుంచి గంజాయిని కొనుగోలు చేసి, కళాశాల విద్యార్థులను లక్ష్యంగా చేసుకొని విక్రయిస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.