తిరుపతి రుయా ఆస్పత్రి ఆవరణలో డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ సహాయ సంచాలకుల కొత్త కార్యాలయాన్ని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మంగళవారం ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రూ.81.60 లక్షలతో నిర్మించిన ఈ కార్యాలయం ద్వారా ప్రజలకు నాణ్యమైన ఔషధాలు నిర్ణీత ధరలకు అందేలా పర్యవేక్షణ చేస్తారని చెప్పారు.