ATP: జేఎన్టీయూ పరిధిలో నవంబరులో నిర్వహించిన బి. ఫార్మసీ సెమిస్టర్ పరీక్ష ఫలితాలు మంగళవారం రాత్రి విడుదలయ్యాయి. వీసీ సుదర్శనరావు, రిజిస్ట్రార్ కృష్ణయ్య ఆదేశాల మేరకు పరీక్షల విభాగం అధికారులు నాలుగో సంవత్సరం మొదటి సెమిస్టర్, రెండో సెమిస్టర్ రెగ్యులర్, సప్లిమెంటరీ ఫలితాలను విడుదల చేశారు. ఈ ఫలితాలు జేఎన్టీయూఏ వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయి.