ఏలూరు జిల్లా వ్యాప్తంగా నిర్వహించే టెట్ పరీక్షలకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ్ మంగళవారం తెలిపారు. టెట్ పరీక్షకు సంబంధించిన పూర్తి వివరాలకు డీఈవో కార్యాలయంలో 90523 91111, 95056 4455, 96036 57499 నంబర్లతో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామన్నారు. జిల్లా ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.