SDPT: హుస్నాబాద్ మండలం వంగరామయ్య పల్లె గ్రామంలో సర్పంచ్ భూక్య రాజేశ్వరి తిరుపతి నాయక్ మంగళవారం ఏకగ్రీవంగా ఎంపికైనట్లు ఎంపీవో తెలిపారు. అలాగే ఎనిమిది మంది వార్డు సభ్యులు ఏకగ్రీవమయ్యా రు. ఈ సందర్భంగా రాజేశ్వరి మాట్లాడుతూ.. ఏకగ్రీవానికి సహకరించిన గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.