MDK: తూప్రాన్ మేజర్ గ్రామపంచాయతీ మాజీ వార్డు సభ్యుడు మంగళవారం సాయంత్రం మృతి చెందారు. తూప్రాన్ పట్టణానికి చెందిన కోమటి సుదర్శనం అనారోగ్యంతో మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు. 1995 గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తూప్రాన్ గ్రామ పంచాయతీ వార్డు సభ్యులుగా ఎన్నికయ్యారు. కోమటి సుదర్శనం మృతి పట్ల పలువురు రాజకీయ నాయకులు సంతాపం తెలిపారు.