war : కండిషన్లకు ఓకే అయితే యుద్ధం వెంటనే ఆపేస్తాం : పుతిన్
రష్యా - ఉక్రెయిన్ల మధ్య యుద్ధాన్ని వెనువెంటనే ఆపేస్తామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. తమ కండిషన్లకు ఉక్రెయిన్ ఓకే అయితే యుద్ధం ముగిస్తామంటూ కీలక ప్రకటనలు చేశారు.
Ukraine Russia War : యుద్ధాన్ని వెంటనే ఆపేస్తామంటూనే, షరతులు వర్తిస్తాయ్ అంటున్నారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. యుద్ధం ఆపివేయడం విషయంలో ఆయన కీలక ప్రకటన ఒకదాన్ని శుక్రవారం విడుదల చేశరు. మాస్కో సేనలు ఆక్రమించిన నాలుగు ప్రాంతాల నుంచి ఉక్రెయిన్ సైన్యం వెనుదిరిగి వెళ్లిపోవాలని పుతిన్ తమ కండిషన్ల చిట్టా విప్పారు. అలాగే నాటో కూటమిలో ఉక్రెయిన్ చేరటానికి చేసే యత్నాలను విరమించుకోవాలని అన్నారు. వీటికి ఆ దేశం అంగీకరిస్తే తాము యుద్ధాన్ని వెనువెంటనే ఆపివేస్తామని పుతిన్ తెలిపారు.
పుతిన్(PUTIN) పై రెండు కండిషన్లతోపాటు మరి కొన్ని డిమాండ్లను సైతం చేశారు. ఉక్రెయిన్ అణ్వాయుధ రహిత దేశంగా కొనసాగాలన్నారు. ఆ దేశంలో రష్యన్ మాట్లాడే వారి ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని వ్యవహరించాలన్నారు. సైనిక బలాన్ని పరిమితంగా ఉంచుకోవాలని కోరారు. పశ్చిమ దేశాలు రష్యా పై విధించిన ఆంక్షలను ఎత్తివేయాలని కోరారు. ఇవన్నీ ఓకే అయితే తాము యుద్ధం ఆపివేస్తామంటూ తెలిపారు.
అయితే ఈ విషయమై ఉక్రెయిన్(UKRAINE) సైతం భిన్నంగా స్పందించింది. రష్యా( RUSSIA) అకారణంగా తమపై యుద్ధానికి దిగిందని తెలిపింది. కాబట్టి అక్కడ శాంతిని నెలకొల్పాల్సిన బాధ్యత కూడా ఆ దేశంపైనే ఉందంది. ఇది శాంతి ప్రతిపాదన కానే కాదని మరిన్ని ఆక్రమణలకు రష్యా రంగం సిద్ధం చేస్తోందని నాటో సెక్రటరీ దుయ్యబట్టారు. అయితే ప్రస్తుతం జీ7 దేశాల శిరాఖగ్ర సదస్సు జరుగుతోంది. అందులో జీ7 దేశాధినేతలు ఉక్రెయిన్‌కు భారీగా ఆర్థిక సాయం ప్రకటించారు. అలాగే అమెరికా, ఉక్రెయిన్ల మధ్య కూడా దీర్ఘ కాలిక రక్షణ ఒప్పందం కుదురింది. పదేళ్ల పాటు అది అమల్లో ఉంటుంది. ఈ నేపథ్యంలోనే పుతిన్ ఈ ప్రతిపాదన తీసుకొచ్చారని పలువురు అభిప్రాయపడుతున్నారు.