సంగారెడ్డిలోని శ్రీ వైకుంఠపురంలో జరగనున్న వైకుంఠ ఏకాదశి పర్వదినానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ ప్రధాన అర్చకులు వరదాచార్యులు తెలిపారు. సుమారు లక్షన్నర మంది భక్తులు ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకునే అవకాశం ఉందని అంచనా వేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశామని, ప్రశాంతంగా దర్శనం కల్పిస్తామని చెప్పారు.