MBNR: కోయిల్ సాగర్ ప్రాజెక్ట్ను ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం రూ.9.50 కోట్లు మంజూరు చేసిందని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి తెలిపారు. శనివారం ఆయన టూరిజం అధికారులు, ఆర్కిటెక్చర్లతో కలిసి ప్రాజెక్ట్ను సందర్శించి అభివృద్ధి పనులపై చర్చించారు. త్వరలోనే పనులు ప్రారంభించి పర్యాటకులకు అన్ని వసతులు కల్పిస్తామన్నారు.