W.G: బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని బార్ అసోసియేషన్ కార్యదర్శి వి.సూర్య ప్రకాశరావు అన్నారు. శనివారం నరసాపురం ప్రభుత్వ బాలికొన్నత పాఠశాలలో బాల్య వివాహాల నిర్మూలనపై అవగాహన సదస్సు నిర్వహించారు. నరసాపురం ఎస్సై సీహెచ్ జయలక్ష్మి మాట్లాడుతూ.. మైనర్ విద్యార్థులుగా ఉండి వివాహాలు చేసుకుని జీవితాలు పాడు చేసుకోవద్దన్నారు.