GDWL: వాల్మీకి బోయ యువత చదువుతో పాటు రాజకీయాలపై అవగాహన పెంచుకోవాలని బీఆర్ఎస్ జిల్లా ఇన్ఛార్జ్ హనుమంతు నాయుడు పిలుపునిచ్చారు. శనివారం వాల్మీకి భవన్లో నిర్వహించిన సర్పంచుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో రాణించినప్పుడే సమాజంలో గుర్తింపు వస్తుందని, గ్రామస్థాయిలో సంఘాలను బలోపేతం చేసి హక్కుల కోసం పోరాడాలని ఆయన సూచించారు.