HYD: నగరంలో మాదకద్రవ్యాల కట్టడికి పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్లు సీపీ సజ్జనార్ తెలిపారు. డ్రగ్స్ నిరోధక విభాగంను మరింత బలోపేతం చేస్తూ, నగరంలోని ప్రతి జోన్కు ఒకటి చొప్పున మొత్తం 7 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. యువత డ్రగ్స్ బారిన పడకుండా నిఘా పెంచుతామని, సరఫరాదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.