ATP: జడ్పీ స్టాండింగ్ కమిటీ, సర్వసభ్య సమావేశాలను జనవరి 3న నిర్వహించనున్నట్లు సీఈవో శివశంకర్ తెలిపారు. ఉదయం 10:30 గంటలకు సమావేశం ప్రారంభం అవుతుందన్నారు. ప్రారంభంలోనే స్టాండింగ్ కమిటీ సమావేశం నిర్వహిస్తామన్నారు. ఆమేరకు తయారు చేసిన అజెండా అంశాలకు అను గుణంగా ఆమోదం తెలిపిన తరువాత సాధారణ సర్వసభ్య సమావేశం ప్రారంభిస్తామని తెలిపారు.