W.G: పాలకోడేరు మండలం మోగల్లు జడ్పీ హైస్కూల్ కు చెందిన విద్యార్థి కే.రామకృష్ణ అమలాపురంలో జరిగిన జోనల్ లెవెల్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్ సెలక్షన్లో సత్తా చాటాడు. బేస్ క్యాంప్ కు సంబంధించి ఎబిలిటీ టెస్ట్‌లో ముందంజలో ఉండి సెలెక్ట్ అయినట్లు హెచ్ఎం త్రినాధులు తెలిపారు. పలువురు ఉపాధ్యాయులు రామకృష్ణను అభినందించారు.