JN: లింగాల గణపురం మండలం జీడికల్ శ్రీ వీరాచల రామచంద్రస్వామి దేవ స్థానంలో శనివారం కొబ్బరికాయల వేలం పాటను నిర్వహించారు. ఎండోమెంట్ ఇన్ స్పెకర్ట్ ఎన్.నిఖిల్, ఆలయ ఈవో వంశీ ఆధ్వర్యంలో జరిగిన వేలం పాటలో కొండబోయిన లక్ష్మి అనే మహిళ రూ.2.40 లక్షలకు వేలం పాట పాడి వేలాన్ని దక్కించుకున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కొండబోయిన మమత సంపత్, ఉప సర్పంచ్ నరేష్ ఉన్నారు.