ATP: గార్లదిన్నె మండలంలోని కోటంక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ ఆవరణలో శనివారం దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో జరిగిన టెంకాయల విక్రయానికి బహిరంగ వేలం పాటను వాయిదా వేసినట్లు ఆలయ ఈవో ఈశ్వర్ రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. గతేడాది కంటే ఈ సారి వేలం పాట తక్కువ ఉండడంతో వాయిదా వేసినట్లు చెప్పాడు. వచ్చే నెల 8న ఈ బహిరంగ వేలం పాట జరుగుతుందని తెలిపారు.