TG: రాష్ట్రంలో మళ్లీ యూరియా కష్టాలు మొదలయ్యాయి. మహబూబాబాద్ జిల్లాలో రైతులు యూరియా కోసం అవస్థలు పడుతున్నారు. కురవి మండలం కాంపల్లి సొసైటీ వద్ద యూరియా కోసం రైతులు భారీగా క్యూలైన్లలో వేచి చూస్తున్నారు. అయితే, ఒక కార్డుకు ఒకటే బస్తా ఇస్తామని అధికారులు స్పష్టం చేశారు. దీంతో అరకొరగా పంపిణీ చేస్తే తమ పరిస్థితి ఏంటని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.