నల్గొండ జిల్లా బీజేపీ కార్యాలయంలో జరిగిన ఘర్షణపై పార్టీ అధిష్టానం తీవ్రంగా స్పందించింది. వాజ్‌పేయి జయంతి కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు వర్షిత్‌రెడ్డి సమక్షంలో నాయకుడు రామరాజుపై దాడి జరగడాన్ని రాష్ట్ర నాయకత్వం సీరియస్‌గా తీసుకుంది. ఈ ఘటన పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించిందని భావించిన రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు వారిని పిలిపించి మందలించినట్లు సమాచారం.