NLG: ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైందని, సమాజం సన్మార్గంలో నడవడానికి ఉపాధ్యాయుల పాత్ర కీలకమని తెలంగాణ శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. ఆదివారం మిర్యాలగూడలో స్టేట్ టీచర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కొనకంచి రాఘవులు ఉద్యోగ విరమణ అభినందన సభకు ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడారు. రిటైర్మెంట్ తర్వాత ఉద్యోగులు సేవల్లో పాల్గొనాలని సూచించారు.