KRNL: ఆస్పరి మండలం బిణిగేరి సమీపంలో ఆదివారం బండల లోడ్‌తో వెళ్తున్న ట్రాక్టర్, ట్రావెల్ బస్సు ఢీ కొనడంతో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తిని వెంటనే ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.