గుంటూరు నగర ప్రజల సమస్యల పరిష్కారానికి ఈ సోమవారం GMC కార్యాలయంలో ‘డయల్ యువర్ కమిషనర్’ మరియు ‘పీజీఆర్ఎస్’ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కమిషనర్ పులి శ్రీనివాసులు ఆదివారం తెలిపారు. ఉదయం 9:30 నుండి 10:30 వరకు 0863-2224202 నంబర్ ద్వారా ఫోన్లో, ఆపై మధ్యాహ్నం 1 గంట వరకు నేరుగా అర్జీల ద్వారా ఫిర్యాదులు చేయవచ్చని ఆయన పేర్కొన్నారు.